Monday 24 June 2013

మధురవాణి తెలుగు బ్లాగు

మధురవాణి | తెలుగు బ్లాగు

నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.

- మధురవాణి
Courtesy http://madhuravaani.blogspot.in/

తెలుగు పుస్తకం ఫేస్‌బుక్ గ్రూప్స్

తెలుగు-పుస్తకం| ఫేస్‌బుక్ గ్రూప్స్


ఫేస్-బుక్ లో ఉన్న తెలుగు వారందరూ పుస్తకాల గురించి, మరీ ముఖ్యంగా తెలుగు పుస్తకాల గురించి మాటలాడుకునేందుకు, చర్చించుకునేందుకు ఒక మంచి వేదికగా ఈ సమూహం ఏర్పరచబడింది.

Courtesy : https://www.facebook.com/groups/telugupustakam/


సరిగమలు సిరిసిరిమువ్వ

సరిగమలు | సిరిసిరిమువ్వ

ఈ బ్లాగుకి అంత ప్రత్యేకత అంటూ ఏం లేదు. ఇది నా కోసం నేను వ్రాసుకుంటున్నది. నాకు వ్రాయాలనిపించినప్పుడు ఏవో నాలుగు ముక్కలు వ్రాస్తుంటాను. నా ఊహలు, ఊసులు, అనుభూతులు, జ్ఞాపకాలు ఇందులో ఉంటాయి. అసలు తెలుగులో వ్రాస్తున్నానన్న తృప్తికోసమే నేను బ్లాగు వ్రాస్తున్నానేమో!

  సిరిసిరిమువ్వ

 బ్లాగు : సరిగమలు

Saturday 22 June 2013

పద్యార్చన

  • పద్యర్చన 


    ఈ శీర్షికలో నిర్దేశిత సమయంలో, సూచింపబడిన విషయానికి సంబంధించిన మంచి పద్యాలను పోస్ట్ చేద్దాం. ఒక పద్యాన్ని పోస్ట్ చేసే ముందు ఇదివరలో
    ఎవరైనా దానిని పోస్ట్ చేశారేమో గమనించండి. స్వీయ పద్యాలు పోస్ట్
    చేయవద్దు. మీరు అందించే పద్యం ఎవరిదో, ఏ గ్రంథం లోనిదో తప్పకుండా తెలియ జేయండి. సాధ్యమైనంతవరకూ తెలుగు పద్యాలకే ప్రాధాన్యం ఇవ్వండి. "పద్యార్చన" కేవలం భక్తి పరమైన స్తోత్ర లహరి కాదు.ఇతరుల బ్లాగ్స్ లోని వ్యాసాలను దయచేసి ఇక్కడ పెట్టవద్దు. సుదీర్ఘకాలం మీ అందరి సంపూర్ణ సహకారంతో ఈ గ్రూప్ కొనసాగాలని మనఃపూర్వక అభ్యర్థన.
    ----------------------------------------------------------------------
    "ఆధునిక పద్యకవుల కవితా వైభవం" లో 22.6.2013 నుండి 30.6.2013 వరకూ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి పద్యాలను, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పద్యాలను పోస్ట్ చేయండి.వీరిని గూర్చి మరొకరు వ్రాసిన పద్యాలను పోస్ట్ చేయవద్దు.

    * విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం, తెలుగు ఋతువులు (ఋతుసంహారం) లోని పద్యాలను మాత్రం పోస్ట్ చేయవద్దు. అవి ఇంతకు ముందు నిర్వహింపబడిన శీర్షికలలో మిత్రులు పోస్ట్ చేశారు. అవి మరల పోస్ట్ చేస్తే తొలగింపబడుతాయి.

    ఆడియో, వీడియో లింక్స్, ఇతరుల బ్లాగ్స్ లోని విషయాలను జతపరుపవద్దు.
    వ్యాఖ్యలు ఆ పద్యానికి సంబంధించినవిగానే ఉండాలి. కవుల పద్యాల్లో మార్పులు చేయరాదు.రచనల ఫొటో కాపీలు పోస్ట్ చేసినచో తొలగింప బడుతాయి. అందరి సహకారము అర్థిస్తున్నాము.
    ----------------------------------------------------------------------
    మరి కొన్ని కవితల కొరకు దిగువు న చూపబడిన ఫేస్‌బుక్ లింక్ పై నొక్కండి.

కవితాంకురం

కవితాంకురం ఫేస్ బుక్ గ్రూప్స్ | కొంపెల్ల రామకృష్ణమూర్తి

"కవితాంకురం" అనే ఈ గ్రూప్ కు అందరికీ స్వాగతం. దీనిలో ఎవరైనా తమ స్వీయ కవితలను పోస్ట్ చేయ వచ్చు. పద్యం,గేయం,వచన కవిత ఇత్యాది కవితా ప్రక్రియలను అందించవచ్చు. కవుల రచనలను సహృదయంతో ప్రోత్సహించి, వారి రచనలను ఆస్వాదించటం, సహేతుకంగా వాటిని గూర్చి చర్చించటం దీని లక్ష్యం.అవాంఛనీయ వివాదాలు రాని రీతిలో అందరమూ కవితా వ్యవసాయం చేద్దాము. క్రొత్తగా వెలువడిన పుస్తకాల వివరాలు, జరిగిన సాహిత్య సమావేశాల వివరాలు (ఛాయా చిత్రాలతో) అందరితో పంచుకుందాము.

కవితలకు సినిమా నటుల చిత్రాలను, అభ్యంతర కరమైన చిత్రాలను జోడించవద్దు.
నమస్కారములతో
-
కొంపెల్ల రామకృష్ణమూర్తి.
మరి కొన్ని కవితల కొరకు దిగువు న చూపబడిన ఫేస్‌బుక్ లింక్ పై నొక్కండి.